ఆయన(యేసు) మీతో చెప్పునది చేయుడి

Tuesday, 19 February 2013

పది ఆజ్ఞలు

దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను. నిర్గమకాండము 20:1


1.నీ దేవుడనైన యెహోవాను నేనే; నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.

2.పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.

3.నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు;

4.విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.

5.నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.

6.నరహత్య చేయకూడదు.

7.వ్యభిచరింపకూడదు.

8.దొంగిలకూడదు.

9.నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.

10.నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు.