ఆయన(యేసు) మీతో చెప్పునది చేయుడి

Monday, 8 April 2013

సూక్ష్మ ప్రార్థన


సూక్ష్మ ప్రార్థన




O GOD! Appear unto me ,Speak unto me.


ఓ దేవా! నాకు కనబడుము నాతో మాట్లాడుము.


O GOD! Appear unto all , Speak unto all.


ఓ దేవా! అ౦ద‌రికి కనబడుము అ౦ద‌రితో మాట్లాడుము.

Tuesday, 19 February 2013

పది ఆజ్ఞలు

దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను. నిర్గమకాండము 20:1


1.నీ దేవుడనైన యెహోవాను నేనే; నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.

2.పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.

3.నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు;

4.విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.

5.నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.

6.నరహత్య చేయకూడదు.

7.వ్యభిచరింపకూడదు.

8.దొంగిలకూడదు.

9.నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.

10.నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు.


Wednesday, 16 January 2013

ప్రవచనములు - నెరవేర్పు

ప్రవచనములు - నెరవేర్పు

1. కన్యక గర్భంలో జన్మించడం
ప్రవచనం : యెషయా 7:14 “కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.”
నేరవేర్పు: మత్తయి 1:18-25 “యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యాసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని ఆమె కుమా రుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.”